భూసేకరణ స్పీడప్​ చేయాలి : కలెక్టర్ మనుచౌదరి

భూసేకరణ స్పీడప్​ చేయాలి : కలెక్టర్ మనుచౌదరి

 సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కార్పొరేషన్ లిమిటెడ్ కు కేటాయించిన భూసేకరణ స్పీడప్​చేయలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి టీజీఐఐసీ, రెవెన్యూ, సర్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల వారీగా తహసీల్దార్, సర్వే అధికారులు కేటాయించిన  ప్రభుత్వ, పట్టా, అసైన్డ్ భూములు ఎన్నో వెరిఫై చేయాలన్నారు.

భూసేకరణ పూర్తి కాగానే కాంపౌండ్ నిర్మించుకోవాలని సూచించారు. కొన్ని భూముల వివరాలు పాత విధానంలో ఉన్నందున కొత్త భూసేకరణ వివరాల ప్రకారం పత్రాలు తయారు చేసుకోవాలన్నారు. ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ అనురాధ, డీజీఎం ఉమా మహేశ్వర్, డీఈ జ్యోతి, డీఎం మహేశ్వర్, తహసీల్దార్లు పాల్గొన్నారు.

చేర్యాలలో కలెక్టర్​పర్యటన

చేర్యాల: చేర్యాలలో శుక్రవారం కలెక్టర్ మనుచౌదరి సుడిగాలి పర్యటన చేశారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ ను సందర్శించి కిచెన్,  స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, వంటసరుకులను పరిశీలించారు. స్టూడెంట్స్​కు నాణ్యమైన భోజనం పెట్టాలని ప్రిన్సిపాల్ పుల్లయ్యను ఆదేశించారు. స్కూల్  ప్రహరీ, కిటికీల రిపేర్లు, రైస్ స్టీమ్ యూనిట్లకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.

అనంతరం ముస్యాల పీహెచ్​సీని తనిఖీ చేసి ఆస్పత్రిలో వివిధ గదులను పరిశీలించారు. స్టాఫ్ అటెండెన్స్, రిజిస్టర్లను చెక్​చేశారు. మెడిసిన్ ఎక్స్​పైరీ రిజిస్టర్ సరిగా మెయింటైన్ చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.  ప్రతి నెలా ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలతో రివ్యూ మీటింగ్ నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించి నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని తహసీల్దార్​ను ఆదేశించారు.

మున్సిపల్ ఆఫీసు భవనంలో  నిర్వహిస్తున్న ఎస్సీ బాలుర హాస్టల్ ను సందర్శించి డార్మెటరీ, కిచెన్, స్టోర్ రూమ్​లను పరిశీలించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజయ్య, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సత్యనారాయణను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ సమీర్ ఖాన్, ఎంపీడీవో మహమూద్ అలీ ఉన్నారు.