ఆహ్లాదకరంగా పోలీస్ ​కన్వెన్షన్ ​సెంటర్ : కలెక్టర్ మనుచౌదరి

ఆహ్లాదకరంగా పోలీస్ ​కన్వెన్షన్ ​సెంటర్ : కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ఆహ్లాదకరంగా ఉందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ శివారులో  కొత్తగా నిర్మించిన పెట్రోల్ బంక్,​ పోలీస్​కన్వెన్షన్​సెంటర్​ను సీపీ అనురాధ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా  సీపీ బంక్ ను త్వరలో ప్రారంభిస్తామని కలెక్టర్ కు చెప్పారు. ఆయన వెంట అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఇన్​స్పెక్టర్లు​కిరణ్, విష్ణు ప్రసాద్, పోలీస్ అధికారులు ఉన్నారు. 

నీట్ పరీక్షా కేంద్రాల పరిశీలన

మే 4న నీట్ ఎంట్రన్స్ పరీక్షను నిర్వహించడానికి కలెక్టర్ మనుచౌదరి, సీపీ అనురాధ జిల్లా కేంద్రంలో పలు విద్యాసంస్థలను పరిశీలించారు. ప్రతిభ డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, సిద్ధార్థ హై స్కూల్, పొన్నాల శివారులోని ఇందూర్ కాలేజ్​, వికాస్ హై స్కూల్ ను నేషనల్ టెస్టింగ్ కమిటీ మార్గదర్శకాల ప్రకారం సదుపాయాలను చెక్ చేశారు. కలెక్టర్​మాట్లాడుతూ సెంటర్లలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్, సీసీ కెమెరా ఏర్పాటు, ఫర్నిచర్, పార్కింగ్ ఫెసిలిటీ ఉన్న సెంటర్లను మాత్రమే ఎంపిక చేస్తామని తెలిపారు. డిస్టిక్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ మూడు సెంటర్లను ఎంపిక చేసి ఆ నివేదికను పై అధికారులకు పంపిస్తామని కలెక్టర్ చెప్పారు. ఆయన వెంట డీఈవో శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.