- కలెక్టర్ మనుచౌదరి
గజ్వేల్, వెలుగు: డెంగ్యూ లక్షణాలతో వచ్చేవారికి వెంటనే ర్యాపిడ్ టెస్టులు నిర్వహించి వైద్యం అందించాలని కలెక్టర్ మనుచౌదరి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్‌ను తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్, ల్యాబ్, మందులగది, డయాలసిస్, చిల్డ్రన్ వార్డులను పరిశీలించి వైద్య సేవలపై ఆరాతీశారు.
వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూపరింటెండెంట్ సాయికిరణ్ కు సూచించారు. ఆయన వెంట ఆర్డీవో బన్సీలాల్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఇతర అధికారులు ఉన్నారు.
వర్షాలపై అధికారులతో సమీక్ష
వర్షాలతో పూర్తిగా నిండిన చెరువులు, కుంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. గజ్వేల్ మండలం అక్కారం కోనాపురం చెరువును పరిశీలించారు. చెరువు కట్టలు తెగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఇరిగేషన్ డీఈ చాందిరాం, ఏఈ శ్రీకాంత్, తహసీల్దార్శ్రవణ్ ఉన్నారు.