సిద్దిపేట(హుస్నాబాద్), వెలుగు : మహిళలు తయారు చేసిన వస్తువులు ఆన్లైన్ ద్వారా మార్కటింగ్ చేసుకునేందుకు అవసరమైన సహకారం అందిస్తామని కలెక్టర్ మను చౌదరి హామీ ఇచ్చారు. బుధవారం హుస్నాబాద్ మండలంలోని పోతారం(ఎస్) గ్రామైక సంఘం, అరుంధతి స్వయం సహాయక సంఘం, కనకతార ప్రసన్న ఇండస్ట్రీస్ తయారు చేస్తున్న నాన్ ఊవెన్ క్లాత్ బ్యాగ్స్, బఫ్ ప్లేట్స్, టైలరింగ్ యూనిట్లను పరిశీలించారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా నాన్ ఊవెన్ క్లాత్ బ్యాగ్స్ బాగున్నాయని అభినందించారు.
అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ హాస్టళ్లకు , ప్రభుsత్వ పాఠశాలలకు యూనిఫామ్ లను ఇక్కడ నుంచి కుట్టి ఇచ్చామని బిల్లులు రాలేదని నిర్వాహకులు కలెక్టర్ కు తెలియజేశారు. బిల్లులు వచ్చేలా చూస్తానని, అప్పటివరకు హామీ ఇచ్చారు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్, జడ్పీ బాలికల హైస్కూళ్లను కలెక్టర్ సందర్శించారు. సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓఓ జయదేవ్ ఆర్య, తహసీల్దార్ రవీందర్ పాల్గొన్నారు.