
బెజ్జంకి, వెలుగు: ధాన్యం కొనుగోళ్లను స్పీడప్చేయాలని కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. మార్కెట్ సెంటర్లకు వచ్చే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో జయదేవ్ ఆర్య, మార్కెట్ డీపీఎం కరుణాకర్, డీటీ రాజు రెడ్డి, మార్కెట్ కార్యదర్శి వెంకటయ్య, సూపర్వైజర్ గంగారాం, సారయ్య, వివోలు, హమాలీలు, రైతులు పాల్గొన్నారు.