సాగును లాభసాటిగా మార్చాలి : కలెక్టర్ మనుచౌదరి 

సాగును లాభసాటిగా మార్చాలి : కలెక్టర్ మనుచౌదరి 

సిద్దిపేట రూరల్, వెలుగు: సాగును లాభసాటిగా మార్చడానికి కావాలసిన పద్ధతులు, టెక్నాలజీని నేర్చుకొని రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా సబ్జెక్ట్​నేర్చుకోవాలని కలెక్టర్​మనుచౌదరి అగ్రికల్చర్​స్టూడెంట్స్​కు సూచించారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామ పరిధిలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్​యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్​కాలేజీని సందర్శించారు.

ఈ  సందర్భంగా తరగతి గదులు, ల్యాబ్​ను పరిశీలించి పాలిటెక్నిక్ స్టూడెంట్స్​తో కాసేపు ముచ్చటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయాన్ని  ప్రోత్సహించడం, సాగు ఖర్చును తగ్గించే లక్ష్యంగా స్టూడెంట్స్ విద్యనభ్యసించాలన్నారు. రెండేళ్ల కోర్సులో ప్రతి అంశాన్ని క్లుప్తంగా నేర్చుకుని సాగులో కొత్త ఒరవడులను సృష్టించాలన్నారు. మారుతున్న కాలంతో పాటు మన ఆలోచన విధానం కూడా మార్చుకోవాలని సూచించారు.  

అల్బెండజోల్ మాత్రలను వేయించాలి

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని సక్సెస్​చేయాలని కలెక్టర్ మనుచౌదరి పిలుపునిచ్చారు. సిద్దిపేట కలెక్టరేట్ లో అవగాహన పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 10న జిల్లాలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏడాది నుంచి 19 ఏళ్ల వయసు కలిగిన వారందరికీ అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో పల్వన్ కుమార్, ఏవో నవీన్ రాజ్ కుమార్, శ్రావణి పాల్గొన్నారు.