- దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్లు, అధికారులు
సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన వినతులను పరిశీలించి సత్వరమే బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 46 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.
కాగా సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ మాజీ సైనికుల వెల్ఫేర్ అసోసియేషన్ కోసం భూమి, నిధులు కేటాయించాలని తెలంగాణ మాజీ సైనికులు ప్రజావాణిలో దరఖాస్తు అందజేశారు. సీడ్స్ ఫాల్ట్ వల్ల పంట నష్ట పోయానని దానికి పరిహారం ఇపించాలని కోరుతూహుస్నాబాద్ మండలంఆరేపల్లి గ్రామానికి చెందిన జీల బుచ్చయ్య కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీఆర్ వో నాగరాజమ్మ, డీఆర్డీవో జయదేవ్ ఆర్యా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి టౌన్: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలని అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ఆఫీసులో డీఆర్వో పద్మజారాణితో కలిసి ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం అడిషనల్కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమం అనంతరం ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. మొత్తం 46 వినతులు వచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సంగారెడ్డి మండలం మల్లాపూర్ జీపీ కార్మికులు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని తమను ఆర్థికంగా ఆదుకోవాలని అడిషనల్కలెక్టర్ను కోరారు. జిన్నారం మండల కేంద్రంలోని తాంబేలు గుట్ట సర్వేనెంబర్1ని ఆనుకొని ఉన్న 58 వ సర్వేనెంబర్ పట్టాదారులు ఒకటో నెంబర్ లోని భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
కంది మండలం చేర్యాల గ్రామంలోని సర్వే నంబర్ 440 లో 19 గుంటలు మహాదేవుని శివాలయానికి చెందినది కాగా ఆలయ భూమికి అనుకొని కొంతమంది ప్రైవేట్వ్యక్తులు వెంచర్వేసి ఆలయ భూమిని కబ్జా చేయడానికి చూస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.