- అధికారులను ఆదేశించిన కలెక్టర్ మనుచౌదరి
హుస్నాబాద్, వెలుగు: ప్రభుత్వం రూపొందించిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సిద్దిపేట జిల్లాలో పెరటికోళ్ల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టాలని, గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే పనులను స్పీడప్ చేయాలని కలెక్టర్మనుచౌదరి అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో హుస్నాబాద్‌మండలం పందిల్లలో స్వయం సహాయక సంఘం సభ్యురాలు మాందటి రమాదేవి నెలకొల్పిన ఇందిరా మహిళా శక్తి పౌల్ట్రీ మదర్ యూనిట్‌ను ఆయన మంగళవారం పరిశీలించారు.
పెరటికోళ్ల యూనిట్ఏర్పాటు, వాటి పెంపకం, వృద్ధి, లాభాలు ఎలా ఉన్నాయని డీఆర్డీవో జయదేవ్ఆర్య, లబ్ధిదారురాలు రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. ఈ యూనిట్‌ను ఆదర్శంగా తీసుకొని జిల్లాలో మహిళలతో పెరటికోళ్ల పెంపకాన్ని చేపట్టడంతోపాటు ఇతర యూనిట్లను నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరా మహిళా శక్తి పథకం కింద డెయిరీ పార్లర్, పాడి ఆవులు, గేదెల యూనిట్, క్యాంటీన్, ఫుడ్ ప్రాసెసింగ్, మీసేవా కేంద్రాలు, మొబైల్ ఫిషరీ రిటైల్ తదితర15 రకాల యూనిట్లను మహిళలతో ఏర్పాటుచేయించాలన్నారు.
మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణకు ఎంపిక చేసిన మహిళా సంఘం సభ్యులకు ఆగస్టు మొదటి వారంలో హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పిస్తామన్నారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రూ.12 కోట్లతో నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట హుస్నాబాద్ మున్సిపల్చైర్పర్సన్రజిత, ఆర్డీవో రామ్మూర్తి, వెటర్నరీ ఏడీ వెంకటరెడ్డి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు కరుణాకర్, వాసుదేవ్ తదితరులున్నారు.
డ్రగ్స్విక్రయాలను అరికట్టాలి
సిద్దిపేట రూరల్: విద్యాసంస్థల్లో డ్రగ్స్ విక్రయాలను అరికట్టాలని యూఎస్ఎఫ్ఐ (యునైటెడ్స్టూడెంట్ఫెడరేషన్ఆఫ్ఇండియా) రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి అన్నారు. మంగళవారం కలెక్టర్ మనుచౌదరి చేతుల మీదుగా మత్తు పదార్థాలను వ్యతిరేకిద్దాం, బంగారు భవిష్యత్‌కు బాటలు వేద్దాం అనే నినాదంతో ఉన్న పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. డ్రగ్స్విక్రయాలు చేసేవారిపై అలాగే వాటిని తీసుకుంటున్న స్టూడెంట్స్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ ను కోరారు. కార్యక్రమంలో శేఖర్, వినయ్, శ్రవణ్ పాల్గొన్నారు.