కాల్వల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలి : కలెక్టర్ మనుచౌదరి

కాల్వల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలి : కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట, వెలుగు: దుబ్బాక నియోజకవర్గంలో కాల్వల  నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ మనుచౌదరి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో  ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ కెనాల్స్ నిర్మాణం, భూసేకరణపై ఇరిగేషన్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర మెయిన్ , డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణ సమస్యలను త్వరగా పరిష్కరించి నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. 

కాల్వల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ  ప్రక్రియను త్వరగా కంప్లీట్​చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను ఆదేశించారు. ఇరిగేషన్,రెవెన్యూ, పోలీస్, సర్యే అధికారులు చెరువు శిఖంలో పంటలు వేయకుండా చూడాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి వంగిన కరెంట్ పోల్స్, వైర్స్,చెడిపోయిన ట్రాన్స్​ఫార్మర్స్ ను పరిశీలించి సరిచేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్ అబ్దుల్ హమీద్, కాళేశ్వరం ప్రాజెక్టు యూనిట్ 1 స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ గీత, ఇరిగేషన్ ఈఈ నారాయణ, ఎలక్ట్రీసిటీ ఎస్ఈ చంద్రమోహన్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.