
ములుగు, వెలుగు: భూభారతితో భూ సమస్యలన్నిటికీ చెక్పడనుందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. ములుగు మండల కేంద్రంలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో, మర్కుక్ మండల పరిధిలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులకు అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి పాల్గొని మాట్లాడారు. రైతులకు మేలు చేయడం కోసమే ప్రభుత్వ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. భూమికి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా జిల్లాలో ఆర్డీవో, అడిషనల్కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి సమస్య నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారమవుతుందని తెలిపారు. ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ఆరిఫా, ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఒంటిమామిడి ఏఎంసీ చైర్మన్ విజయ మోహన్, వైస్ చైర్మన్ ప్రభాకర్ గుప్తా, జిల్లా మాజీ కో ఆప్షన్ సభ్యుడు సలీం, కృష్ణారెడ్డి, రమేశ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, బాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, వాజిద్, మణి పవన్ రెడ్డి పాల్గొన్నారు.
నారాయణ్ ఖేడ్: ధరణి పోర్టల్వల్ల జరిగిన పొరపాట్లను భూభారతి చట్టంతో సరిదిద్ది రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఖేడ్ లోని సాయిబాబా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్క్రాంతితో కలిసి పాల్గొని మాట్లాడారు. భూ సమస్యలు ఉన్న రైతులు భూభారతి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నిర్దిష్ట గడువులోపు రైతుల సమస్యల్ని పరిష్కరించే అవకాశాన్ని ఆర్డీవో, కలెక్టర్లకు ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతుల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి అనేక స్కీములు కొనసాగిస్తున్నారని చెప్పారు.
జోగిపేట: జోగిపేటలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో కలెక్టర్ క్రాంతి, అడిషనల్కలెక్టర్ మాధురితో కలిసి పాల్గొని మాట్లాడారు. భూభారతి చట్టం భూ సమస్యలు తీర్చే శక్తివంతమైన ఆయుధంలా పనిచేస్తుందన్నారు. ఈ చట్టంతో ఇక ముందు భూ సరిహద్దుల మధ్య గొడవలు ఉండవని తెలిపారు. ధరణి స్థానంలో నూతన చట్టాన్ని తేవడానికి ప్రభుత్వం నిపుణులతో కమిటీని వేసి అన్ని రాష్ట్రాల్లో పరిశీలించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు.