
బెజ్జంకి, వెలుగు: మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు కోసం శుక్రవారం కలెక్టర్ మనుచౌదరి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి అలుగు వర్షిణి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్థల పరిశీలన చేశారు. కాలేజీకి కేటాయించిన స్థలంలో ఎక్కడెక్కడ భవనాలు నిర్మించాలి, ఎలాంటి వసతులు కల్పించాలనే విషయమై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అగ్రికల్చర్కాలేజీకి పాలనాపరమైన అనుమతులు లభించాయని, మేలో భూమి పూజ చేసి టెండర్లు పిలిచి నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు.
ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించగా తొలి విడతగా రూ.47కోట్లు మంజూరుచేసిందన్నారు. సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో చదువుకున్న స్టూడెంట్స్కు ఇందులో ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు వారి వెంట ఏఎంసీ చైర్మన్ కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి, ఎఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు నరసయ్య, శ్రీనివాస్, సంతోష్, లక్ష్మినారాయణ గౌడ్, శ్రీనివాస్ రావు, రమేశ్, రాజు పాల్గొన్నారు.