గద్వాల, వెలుగు : వచ్చే ఎన్నికల్లో డబ్బు ప్రభావితం చేసే ప్రాంతాలపై రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో ఎక్సైజ్, పోలీస్ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. గత ఎన్నికల్లో డబ్బు, గోల్డ్, సిల్వర్, లిక్కర్ పంపిణీపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2014, 2018 ఎన్నికల్లో ఏ ప్రాంతాల్లో డబ్బు, లిక్కర్, గోల్డ్ పంపిణీ చేశారనే విషయంపై రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఒకే అకౌంట్ నుంచి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసిన వివరాలు ఇవ్వాలని ఎల్డీఎం అయ్యప్ప రెడ్డిని ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ రవి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదులు పాల్గొన్నారు.