సీజనల్ వ్యాధులను కట్టడి చేయాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

సీజనల్ వ్యాధులను కట్టడి చేయాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

కూసుమంచి, వెలుగు : సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం తిరుమలాయపాలెం మండలం అజ్మీరా తండాలో ఆయన పర్యటించారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 

వ్యాధులు ప్రబలుతున్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయంతో లాభనష్టాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. పంట రుణమాఫీ రాని వారు వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. కలెక్టర్ వెంట ట్రైనీ అసిస్టెంట్​కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, డీఎంహెచ్​వో సుబ్బారావు, ఎంపీడీవో సిలార్ సాహెబ్, తహసీల్దార్ రామకృష్ణ ఉన్నారు.

కలెక్టరేట్ లో ఎస్ బీఐ బ్రాంచ్ ప్రారంభం

ఖమ్మం టౌన్ : ఖమ్మం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ గురువారం ప్రారంభించారు. అన్ని శాఖల కార్యాలయాలు కలెక్టరేట్ లో ఉన్నందున ఉద్యోగుల సౌకర్యార్థం బ్యాంక్ శాఖను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.