రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ పక్కాగా ఉండాలి : ​ ముజమ్మిల్ ఖాన్

రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ పక్కాగా ఉండాలి : ​ ముజమ్మిల్ ఖాన్
  • ఖమ్మం కలెక్టర్​ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం కార్పోరేషన్​, వెలుగు: రాజీవ్ యువ వికాసం పథకం కింద వచ్చే దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దరఖాస్తుదారులతో ముచ్చటించారు. 

ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉందని, ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పించేందుకు ఇబ్బందులు ఉన్నవారు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, సంబంధిత మండల ఎంపీడీఓ కార్యాలయాల్లో ఆఫ్ లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు 5 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి దరఖాస్తు వివరాలను రిజిస్టర్ లో నమోదు చేసి దరఖాస్తుదారులకు రశీదు ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.