పర్యావరణాన్ని పాడుచేసి, ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న వారికి ఖమ్మం జిల్లా కలెక్టర్ మజమ్మిల్ ఖాన్ వార్నింగ్ ఇచ్చారు. సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ కాలినడకన కొన్ని ఇళ్లకు వెళ్లారు. చాలామంది ఖాళీ ప్లాట్లల్లో పేరుకపోయిన చెత్తవ్లల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. దాంతో జిల్లావ్యాప్తంగా ఖాళీ ప్లాట్ల యజమానులకు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజారోగ్యంతో ఆటలాడకూడదని ఆయన ప్లాట్ల ఓనర్లను హెచ్చరించారు.
ALSO READ: సీఎం రిలీఫ్ ఫండ్కి..అపెక్స్ బ్యాంక్ పాలకవర్గం కోటిన్నర విరాళం
ఖాళీ ప్లాట్లను శుభ్రంగా ఉంచుకోకపోతే.. ప్రభుత్వ స్థలం అంటూ బోర్డులు పెట్టాలని అధికారులకు ఆదేశాలు పంపారు. ఖాళీ ప్లాట్లను శుభ్రం చేయకుండా పక్కవారికి ఇబ్బంది కలిగిస్తే ఆ ప్లాట్లను ప్రభుత్వ ప్లాట్లుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ప్రతి రోజు ఖాళీ ప్లాట్లల్లో పేరుకుపోతున్న చెత్త వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజారోగ్యానికి హాని కలిగించే వాటిపై చర్యలు ఉంటాయన్నారు జిల్లా బాస్. అపరిశుభ్రంగా ఉంచే ప్లాట్లల్లో ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టాలని సూచించారు. కలెక్టర్ హెచ్చరికతో ప్రజల్లో హర్షం వ్యక్తం అయ్యింది.