పట్టు వదలకుండా పోరాడితేనే విజయం : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

పట్టు వదలకుండా పోరాడితేనే విజయం : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం, వెలుగు: ఓటమి అంచు వరకు వెళ్లినా, పట్టుదలతో ప్రయత్నిస్తే పక్కాగా విజయం సాధించవచ్చనే స్ఫూర్తిని క్రీడలు ఇస్తాయని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. సర్దార్ పటేల్ స్టేడియంలో ఖమ్మం జిల్లా టెన్నిస్ అసోసియేషన్ (కేడీటీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ను శనివారం ఆయన టాస్ వేసి ప్రారంభించారు. సర్దార్ పటేల్ స్టేడియం చుట్టూ తిరిగి సౌకర్యాలను, టెన్నిస్ కోర్టులను పరిశీలించారు.

క్రీడాకారులతో కలిసి  ట్రయల్ మ్యాచ్ ఆడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడా పోటీలకు ఖమ్మం వేదికైందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, ఏసీపీ కుమారస్వామి, ట్రాఫిక్ సీఐ సాంబశివరావు,  టెన్నిస్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చల్లపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్​అనిల్, ట్రెజరర్ త్యనారాయణ, చీఫ్ రిఫరీ ప్రవీణ్ నాయక్, కాళ్ల పాపారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేశ్, కాళ్ల సూర్య పాల్గొన్నారు.