- ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం కలెక్టరేట్ కు ఆదివారం ఉదయం పలు ప్రారభోత్సవాలకు డిప్యూటీ సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా జరగాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న బస్ స్టాప్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, ఫీడింగ్ రూమ్, ఎస్బీఐ, డైనింగ్ రూమ్ ను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పీ. శ్రీజ, డీఆర్డీవో సన్యాసయ్య, అధికారులు పాల్గొన్నారు.