వ్యాధులు ప్రబలకుండా చూడాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

వ్యాధులు ప్రబలకుండా చూడాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం టౌన్, వెలుగు : వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్​ కమిషనర్లు, ఎంపీవోలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రజలకు కష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముంపు ప్రాంతాలు, ప్రమాదకర నీటి వనరుల పట్ల ముందస్తుగా మ్యాపింగ్ చేసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పారు.

శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చాలని, ఇందుకు ప్రతి గ్రామంలో ఒక భవనాన్ని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. విపత్తు సంభవిస్తే ఆదుకునేందుకు ప్రతీ వార్డు, గ్రామ స్థాయిలో ఒక అధికారిని కేటాయించి, ఆ అధికారి ఫోన్ నంబర్ గ్రామస్తులకు ఇవ్వాలని చెప్పారు. ప్రతీ డ్రైయిజీని శుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్ ను తొలగించడం, బ్లీచింగ్, ఫాగింగ్ చేయడం చేయాలన్నారు.

ALSO Read :స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ పోటీలకు ఎంపిక

 

ఫీవర్ సర్వే చేసి వైద్య శిబిరాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డ్రై డే ను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఎక్కడైనా మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలు ఉంటే వెంటనే రిపేర్లు చేయాలని చెప్పారు.  దోమలను అరికట్టేందుకు ఆయిల్ బాల్స్ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఇన్​చార్జ్ స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్, డిఆర్డీవో సన్యాసయ్య, జడ్పీ సీఈవో ఎస్. వినోద్, డీపీవో హరికిషన్, ఉప జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ సైదులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.