ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లాలో శుక్రవారంతో సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని, జిల్లాలో 107.32 శాతం సర్వే జరిగిందని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో 3,51,238 ఇండ్లకు గాను 3,80,616 ఇండ్లు సర్వే చేసి 108.36 శాతం పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతలో 1,20,231 ఇండ్లకు గాను 1,25,354 ఇండ్లు సర్వే చేసి 104.26 శాతం సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు.
జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 4,71,469 హౌస్ లిస్టింగ్ చేసి మొత్తం 5,05,970 ఇండ్ల సర్వే చేసి 107.32 శాతం సర్వే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. సర్వే వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసే ప్రక్రియ జరుగుతున్నట్లు, జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 శాతం వరకు వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేసినట్లు తెలిపారు.