
ఖమ్మం రూరల్, వెలుగు : ఇందిరమ్మ ఇల్లు ప్రజలందరికీ తెలిసేలా మండలానికో నమూనా ఇల్లు నిర్మించనున్నట్లు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం తరుణీహాట్ ఆవరణలో ఇందిరమ్మ నమూనా ఇల్లు నిర్మించే స్థలాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు నమూనా లబ్ధిదారులకు భరోసా ఇచ్చేలా ఉండాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు పద్ధతి ప్రకారం నిర్మించేందుకు మేస్త్రీలకు ఇంజినీరింగ్ నిపుణులతో శిక్షణ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.