ఆగస్టు లోపు పెండింగ్​ పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ఆగస్టు లోపు పెండింగ్​ పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం టౌన్, వెలుగు : అమ్మ ఆదర్శ పాఠశాలల పెండింగ్​ పనులను ఆగస్టు నెలాఖరు లోపు పూర్తయ్యేలా కార్యాచరణ చేయాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అధికారులతో అమ్మ ఆదర్శ పాఠశాలల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద  955 పాఠశాలల అభివృద్ధి పనులు చేపట్టగా, 508 పాఠశాలల పనులు కంప్లీట్​ కాగా, 447 పాఠశాలల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.  పనులు తుది దశలో ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా పూర్తి చేయాలని  చెప్పారు.

టీజీఈడబ్ల్యూ ఐడీసీ ద్వారా చేపట్టిన 177 స్కూళ్లలోని అభివృద్ధి పనుల్లో 104 పనులు పూర్తి కాగా, 73 పాఠశాలల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. నిధులకు ఎలాంటి సమస్యలేదని, పూర్తయిన పనులకు వెంటనే ఎంబీ రికార్డ్ చేసి, చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్​చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, ఆర్ అండ్ బీ ఎస్ఈ హేమలత, ఈఈ సీహెచ్. వేణు, పీఆర్ ఈఈలు వెంకట్ రెడ్డి, శ్రీరాం కోటి నాయక్, ఖమ్మం నగర పాలక సంస్థ ఈఈ కృష్ణలాల్, గిరిజన సంక్షేమ శాఖ డీఈ బి. రాజుపాల్గొన్నారు.

మహిళా శక్తి లబ్ధిదారుల సెలెక్షన్ పక్కాగా చేయాలి

ప్రభుత్వం మహిళా శక్తి కింద చేపట్టిన వివిధ కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపిక  పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అధికారులతో మహిళా శక్తి యూనిట్లపై ఆయన సమీక్షించారు. ఆయా ప్రాంతంలో ఉన్న డిమాండ్ ను బట్టి యూనిట్ల ఎంపిక చేయాలన్నారు. బ్యాంకు లింకేజ్ రుణాలతో పచ్చళ్ళ తయారీ, కిరాణా, మొబైల్ టిఫిన్, టైలరింగ్, మెకానిక్, టీ స్టాల్, మెడికల్ షాపు, ఫర్టిలైజర్ షాప్, మీ సేవా, పాడి పశువుల, పౌల్ట్రీ, బోటిక్, లాండ్రీ, బ్యూటీపార్లర్ మొదలగు వివిధ వ్యాపార యూనిట్ల ఏర్పాటు కోసం లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలన్నారు. 

స్టూడెంట్స్ ఏకాగ్రతతో ముందుకెళ్లాలి 

విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ఏకాగ్రతతో ముందుకెళ్లాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. రఘునాథపాలెం మండలం, వి. వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారంఆ యన  ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, ఇతర సౌకర్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కల్వకుర్తిలో జరిగిన సౌత్ జోన్ క్రీడాపోటీల్లో ఫుట్ బాల్ క్రీడలో మూడో స్థానం పొందిన జట్టు బాలికలను కలెక్టర్ అభినందించారు.