టెన్త్​లో 1‌‌‌‌00 శాతం ఉత్తీర్ణత సాధించాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

టెన్త్​లో 1‌‌‌‌00 శాతం ఉత్తీర్ణత సాధించాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులు పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా టీచర్లు పని చేయాలని ఖమ్మం కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో జిల్లా ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై అడిషనల్​కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి స్కూళ్ల హెచ్​ఎంలు, ఎంఈవోలతో సమీక్షించారు. వారం రోజుల్లో  బాగా చదివే పిల్లలు ఏ కేటగిరి, యావరేజ్ పిల్లలను బీ కేటగిరి, ఫెయిల్ అవుతారు అనుకునే పిల్లలను సీ కేటగిరిగా విభజించాలని సూచించారు. 

10వ తరగతి విద్యార్థుల కోసం జనవరి నెలలో మోటివేషన్ సెషన్ ఏర్పాటు చేయాలన్నారు. టీచర్లకు ఏదైనా సలహాలు, సూచనలు ఉంటే తన దృష్టికి తీవాలని చెప్పారు.  అడిషనల్​ కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ సబ్జెక్ట్ టీచర్లు సెలవులో ఉంటే మండల పరిధిలో  డిప్యూటేషన్ విధులు కేటాయించి ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఈవో సోమశేఖర శర్మ ఉన్నారు.