ఖమ్మం టౌన్, వెలుగు : మున్నేరు వరద ఉధృతికి ముంపునకు గురయిన ప్రాంతాలను గుర్తించేందుకు 13 డివిజన్ లలో సర్వే చేయడం కోసం 14 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు.
మంగళవారం ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి అధికారుల సమావేశం నిర్వహించారు. సర్వేలో పారదర్శకంగా రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్
ఆదేశించారు.