ఆకట్టుకున్న ఖవ్వాలి
లింగంపేట, వెలుగు: గ్యార్మీ పండుగ సందర్భంగా సోమవారం రాత్రి లింగంపేటలోని హైకోర్టు న్యాయవాది మోహిన్ అహ్మద్ ఖాద్రి ఓ పంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఖవ్వాలి అందరినీ ఆకట్టుకుంది. బోధన్, హైదరాబాద్‌లకు చెందిన ఖవ్వాలి బృందం రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఖవ్వాలి నిర్వ హించారు. గ్యార్మీ పండుగకు అజ్మీర్ దర్గా హాజీ సయ్యద్ షబ్బీర్ అహ్మద్, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసుల్ ఖాన్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, ఎల్లా రెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్, ఎల్లా రెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట ఎస్సైలు, వివి ధ పార్టీలకు చెందిన లీడర్లు, న్యాయవాది మోహిన్ అహ్మద్ ఖాద్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
జాతీయ భావాలు పెంపొందించాలి
కామారెడ్డి, వెలుగు: స్టూడెంట్లలో దేశ భక్తి, జాతీయ భావాలను పెంపొందించాలని ఏబీవీపీ కామారెడ్డి జిల్లా ప్రముఖ్ గిరిప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కాలేజీలో నగర అభ్యాసవర్గ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా గిరిప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ నిరంరతం పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో విభాగ కన్వీనర్ మనోజ్, వ్యవస్థ ప్రముఖ్ గంగసాని స్వామి, జిల్లా కన్వీనర్ గుజరి కృష్ణా మాట్లాడారు. ఏబీవీపీ కామారెడ్డి నగర సెక్రటరీగా చరణ్‌ను నియమించారు.
తోటి వారికి సహాయపడాలి
నిజామాబాద్, వెలుగు: మత గురువులు, మహనీయుల జీవితాలు అందరికీ ఆదర్శనీయమని, వారు సూచించిన మార్గంలో పయనిస్తూ తోటి వారికి సహాయపడాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. నగరంలోని గాజుల్‌పేట్‌లోని గురుద్వార్‌లో మంగళవారం నిర్వహించిన గురునానక్ జయంతి వేడుకల్లో కలెక్టర్‌పాల్గొన్నారు. గురుద్వార్‌కు ఇచ్చిన ఆయనకు సిక్కు మతపెద్దలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కలెక్టర్ వారితో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వమతాల సారం ఒక్కటేనని అన్నారు. కార్యక్రమంలో సిక్కు మత పెద్దలు సర్దార్ దర్శన్ సింగ్, సర్దార్ కృపాల్ సింగ్, సర్దార్ రాజేందర్ సింగ్, సర్దార్ గోవింద్ సింగ్, సర్దార్ అజయ్ సింగ్ ఉన్నారు.
నేటి నుంచి ఆర్మూర్‌లో రాష్ట్ర స్థాయి క్రీడలు
ఆర్మూర్, వెలుగు: సోషల్ వెల్ఫేర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆర్మూర్ టౌన్‌లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ గ్రౌండ్‌లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు 8వ రాష్ట్ర క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ దుర్గారెడ్డి, గేమ్స్ఇన్చార్జి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నీరజారెడ్డి తెలిపారు. మంగళవారం స్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను వారు పరిశీలించి మాట్లాడారు. పోటీలకు 1200 మంది క్రీడాకారులు హాజరుకానున్నారని, వారికి వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. వాలీబాల్, హ్యాండ్ బాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, టెన్నికాయిట్, ఫుట్ బాల్, కబడ్డీ, చెస్, క్యారం, అథ్లెటిక్స్ క్రీడల్లో అండర్-14, అండర్-17, అండర్-19 బాయ్స్ కేటగిరిలో క్రీడలు జరుగుతాయన్నారు. వారి వెంట టోర్నీ నిర్వహణ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉదయభాస్కర్, గ్రౌండ్ ఇన్‌చార్జి భాస్కర్‌గౌడ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సత్యనారాయణ, చందర్, శ్రీనివాస్, ఆది బాబు, సంధ్యారాణి, శ్రీధర్ ఉన్నారు.
ఎంబీబీఎస్ స్టూడెంట్‌కు ఎమ్మెల్యే ఆర్థిక సాయం
లింగంపేట, వెలుగు: మండలంలోని భవానీపేట గ్రామానికి చెందిన గర్నే రసజ్ఞ అనే పేద విద్యార్థినికి మంగళవారం ఎమ్మెల్యే జాజాల సురేందర్ రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. రసజ్ఞ ఇటీవల నిర్వహించిన నీట్పరీక్షలో ప్రతిభ చాటి ఎంబీబీఎస్ సీటు సాదించింది. నిరుపేద కుటుంబానికి చెందిన రసజ్ఞ తల్లిదండ్రులు కాలేజీ ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్నారని తెలుసుకున్న ఎమ్మెల్యే విద్యార్థిని తన క్యాంప్ ఆఫీస్‌కు పిలిచి నగదు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్, సీనియర్ లీడర్సిద్దారెడ్డి, భవానీపేట ఎంపీటీసీ మెంబర్ ఆకుల సురేందర్, సర్పంచ్ నర్సమ్మ, ఉప సర్పంచ్
కొలిమి కుమార్, టీఆర్ఎస్గ్రామ కమిటీ అధ్యక్షుడు మదర్‌పాషా, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు సక్రూ నాయక్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
లింగంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జాజాల సురేందర్ మంగళవారం పరిశీలించారు. బస్టాండ్‌లో సీసీ రోడ్డు, మరుగుదొడ్ల నిర్మాణాల కోసం రూ.36 లక్షలను మంజూరు చేయించారు. ఈ మేరకు పనులు ఎలా చేస్తున్నారని చెక్ చేశారు. ఆయన వెంట సర్పంచ్బొల్లు లావణ్య, ఉప సర్పంచ్ కౌడ రవి, టీఆర్ఎస్ లీడర్లు దివిటి రమేశ్, అబ్దుల్ నయీం, ముదాం సాయిలు, మహిపాల్‌రెడ్డి, నర్సింహులు, ఫరందాములు ఉన్నారు. అనంతరం కన్నాపూర్ గ్రామానికి చేరుకుని అనారోగ్యంతో బాధపడుతున్న ఎంపీటీసీ గండిగారి వెంకట్‌ను పరామర్శించారు.
బీజేపీ నేతలకు ధన్‌పాల్ పరామర్శ
నిజామాబాద్ టౌన్, వెలుగు: నిజామాబాద్ నగరానికి చెందిన పలువురు బీజేపీ నేతలను పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ మంగళవారం పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన 37వ డివిజన్‌కు చెందిన నాయకులు రాకేశ్, శస్త్ర చిక్సిత చేసుకున్న శ్రీనివాస్ ఇండ్లకు వెళ్లిన ధన్‌పాల్ వారి ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వంజరి సంఘం మాజీ అధ్యక్షుడు గంగాధర్‌ను ఆయన పరామర్శించారు. ఆయన వెంట బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, నాయకులు దత్రిక రమేశ్, విజయ్, ఆశిష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.