![పొద్దు పొద్దున్నే స్టూడెంట్ ఇంటికి కలెక్టర్.. విద్యార్థికి సడెన్ సర్ప్రైజ్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-of-yadadri-bhuvanagiri-gave-a-surprise-to-the-student_KZwmiVEDRT.jpg)
- పొద్దు పొద్దున్నే స్టూడెంట్ ఇంటి తలుపు తట్టిన యాదాద్రి కలెక్టర్
- తనను తాను కలెక్టర్‌గా పరిచయం చేసుకొని.. అండగా ఉంటానని భరోసా
- టెన్త్ ఎగ్జామ్స్ ముగిసేవరకు నెలకు రూ. 5 వేలు సాయం చేస్తానని ప్రకటన
- ఉన్నత చదువులకు కూడా తోడ్పాటునందిస్తానని హామీ
యాదాద్రి, వెలుగు: ఓ టెన్త్ క్లాస్ స్టూడెంట్ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్హనుమంతరావు సర్ప్రైజ్ చేశారు. పొద్దు పొద్దున్నే ఆ స్టూడెంట్ఇంటి తలుపు తట్టిన ఆయన.. తనను తాను కలెక్టర్‌గా పరిచయం చేసుకున్నారు. చదువులో రాణించాలని, తాను అండగా ఉంటానని ఆ పేదింటి విద్యార్థికి భరోసా ఇచ్చారు. అనంతరం సత్వర సాయంగా కొంత డబ్బు అందజేశారు. విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కలెక్టర్ హనుమంతరావు.. జిల్లాలోని ఆఫీసర్లు అందరూ హాస్టల్నిద్ర చేయాలని ఇటీవల ఆదేశించారు. చదువులో వీక్‌గా ఉన్న స్టూడెంట్లతో మాట్లాడాలన్నారు.
బుధవారం రాత్రి ఒక్కో ఆఫీసర్ఒక్కో హాస్టల్లో నిద్ర చేయగా.. కలెక్టర్ హనుమంతరావు సంస్థాన్‌నారాయణపురంలోని ఎస్సీ హాస్టల్లో నిద్రించారు. ఈ సందర్భంగా డీఈవో నుంచి.. స్టడీలో వీక్‌గా ఉన్న టెన్త్ క్లాస్స్టూడెంట్ల లిస్ట్తీసుకొని పరిశీలించారు. కంకణాలగూడెం గ్రామానికి చెందిన భరత్చంద్రచారిని కలవాలని నిర్ణయం తీసుకున్నారు. గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకు గ్రామానికి చేరుకొని.. భరత్ చంద్రచారి ఇంటి తలుపును కలెక్టర్తట్టారు. తలుపు తీసిన భరత్ తల్లి విజయలక్ష్మికి తనను తాను కలెక్టర్‌గా పరిచయం చేసుకోవడంతో ఆమె ఆశ్చర్యపోయారు.
అప్పుడే అక్కడికి చేరుకున్న భరత్చంద్రచారితోనూ కలెక్టర్మాట్లాడారు. ఎలా చదువుతున్నావని ఆరా తీశారు. ‘‘మీ అమ్మ కష్టపడి చదివిస్తున్నది. మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి’’ అని ఆ బాబుకు సూచించారు. భవిష్యత్తులో ఏమవుతావని కలెక్టర్ ప్రశ్నించగా.. పోలీస్ ఆఫీసర్ అవుతానంటా భరత్ సమాధానం ఇచ్చాడు. ఆ బాబుకు కూర్చొని చదవడానికి వీలుగా చైర్, రాసుకోవడానికి రైటింగ్ పాడ్‌ను కలెక్టర్అందజేశారు.
అనంతరం కుటుంబ పరిస్థితిని ఆరా తీశారు. భరత్ తండ్రి కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. తల్లికి అనారోగ్యం. చెల్లికి మానసికస్థితి సరిగ్గా లేదు. రూ. 2 వేల పింఛన్ ఒక్కటే ఆ కుటుంబానికి ఆధారమని తెలుసుకున్న కలెక్టర్.. చదువుల కోసం భరత్‌ను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. టెన్త్ పరీక్షలు ముగిసే వరకు నెలకు రూ. 5 వేల చొప్పున అందజేస్తానన్నారు. ఫిబ్రవరికి సంబంధించిన రూ.5 వేలు ఇచ్చారు. పాలిటెక్నిక్ఎంట్రన్స్రాయిస్తానన్నారు. భరత్ స్థిరపడే వరకు సహకారం అందిస్తానని కలెక్టర్హనుమంతరావు హామీ ఇచ్చారు. దీంతో ఆ పేదింటి కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.