
కాశీబుగ్గ/ నర్సంపేట, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథంకలో భాగంగా రెండో విడత ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారుల గుర్తించే ప్రక్రియ స్పీడప్ చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి ఆదేశించారు. శనివారం గ్రేటర్ సిటీలోని 18వ డివిజన్లో క్రిస్టియన్కాలనీ, నర్సాపూర్, ఖానాపురంలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల గుర్తింపు సర్వీ తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఖానాపురం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హుల గుర్తింపు పారదర్శకంగా, జవాబుదారీతో జరగాలన్నారు. ఈనెల 30 వరకు ప్రక్రియ పూర్తికావాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రామిరెడ్డి, హోసింగ్ ప్రాజెక్ట్ అధికారి గణపతి తదితరులు పాల్గొన్నారు.