పోషకాహార లోపం లేని జిల్లాగా మార్చాలి : కలెక్టర్ పమేలా సత్పతి

పోషకాహార లోపం లేని జిల్లాగా మార్చాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ జిల్లాను పోషకాహార లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుధవారం జిల్లా పోషణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తీవ్ర పోషణ లోపంతో ఉన్న  పిల్లలను గుర్తించి, వారిని వైద్య శాఖ సాయంతో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీకి పంపించాలన్నారు. అక్కడ ప్రత్యేక ఆహారం, చికిత్స ద్వారా పిల్లలు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారని తెలిపారు. మునగ, కరివేపాకు, నిమ్మ వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలని చెప్పారు. 

ప్రతి శుక్రవారం  నిర్వహించే శుక్రవారం సభలో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా సంక్షేమ అధికారి సబిత, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో వెంకటరమణ, డీఈవో జనార్దన్ రావు, డీపీఓ రవీందర్, సీడీపీవోలు, సిబ్బంది పాల్గొన్నారు.

బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు

బాల్యవివాహాలు చేస్తే కుటుంబ సభ్యులపై, వివాహాలు జరిపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి  హెచ్చరించారు. బాల్యవివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘బాల్య వివాహ్ ముక్త్ భారత్’ అవగాహన ముగింపు నిర్వహించారు.