
హుజూరాబాద్, వెలుగు: రైతుల భూములకు భూభారతి చట్టం భరోసా కల్పిస్తుందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంపై శనివారం పట్టణంలోని సిటీ సెంటర్ ఫంక్షన్ హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధరణి పోర్టల్‌లో లేని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే భూభారతి చట్టం ప్రకారం అప్పీలు చేసుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్‌దేశాయ్, లక్ష్మీ కిరణ్, ఆర్డీవో రమేశ్, తహసీల్దార్ కనకయ్య, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
328 కొనుగోళ్లు సెంటర్లు ప్రారంభించాం
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో 328 కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్ల సేకరణ ప్రారంభించినట్లు కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. శనివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ జిల్లాలో 2,66,896 ఎకరాల్లో వరి సాగవగా.. 5,86,723 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 96 మిల్లులకు 4.30లక్షల వేల మెట్రిక్ టన్నుల వడ్లు మిల్లింగ్ చేసే సామర్థ్యం ఉందన్నారు.