- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ బస్ స్టేషన్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ పమేలాసత్పతి పాల్గొని స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సరైన సమయంలో రక్తం లభించక మరణాలు సంభవించే అవకాశం ఉందని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు.
జానపద కళలను ప్రోత్సహించాలి
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కళాభారతిలో కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 41వ వార్షికోత్సవాలు జరిగాయి. ఇందులో మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళాకారులు భవిష్యత్తు తరాలకు తమ కళలను నేర్పించాలన్నారు.
అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్టీసీ ఆర్ఎం రాజు, డీఆర్ఎం భూపతిరెడ్డి, డీడబ్ల్యుఒ సబిత, తెలంగాణ నాటక సమాఖ్య అధ్యక్షుడు సదానందం, తెలంగాణ జానపద వృత్తి కళాకారుల సమాఖ్య అధ్యక్షుడు కృపాదానం పాల్గొన్నారు.
కాలేజీలు రీసెర్చ్ సెంటర్లుగా డెవలప్ కావాలి
కరీంనగర్ టౌన్,వెలుగు: కాలేజీలు పరిశోధనా కేంద్రాలుగా ఎదగాలని, పరిశోధనా ఫలితాలను క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా చూడాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం స్థానిక ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగిన రెండ్రోజుల నేషనల్ సెమినార్ క్లోజింగ్ మీటింగ్ లో కలెక్టర్ పాల్గొన్నారు.
యూపీఐ ఆలోచన ఒక చిన్న పరిశోధనా పత్రం ద్వారా పుట్టిందే అన్నారు. సమావేశంలో డాక్టర్ ఎం.మల్లారెడ్డి,శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ జాస్తి రవి కుమార్, కాలేజీ వైస్ ప్రిన్సిపల్ నితిన్, లెక్చరర్లు డా. కె.సురేందర్ రెడ్డి, ఎల్‌ఐసీ సీనియర్ మేనేజర్ ఎస్వీ ప్రసాద్ రావు,స్టూడెంట్లు పాల్గొన్నారు.