డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకుందాం : కలెక్టర్ పమేలా సత్పతి

డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకుందాం : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్,వెలుగు:  డ్రగ్స్ రహిత  జిల్లాగా కరీంనగర్ ను మార్చుకుందామని  కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో డ్రగ్స్  నిర్మూలనలో భాగంగా పోలీస్, ఎక్సైజ్,తదితర శాఖల  అధికారులతో నిర్వహించిన మీటింగ్లో  కలెక్టర్ పమేలాసత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ.. యువత డ్రగ్స్ బారిన పడకుండా, మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.

  సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ..  పోలీసు శాఖ తరఫున అధికారులందరి సమన్వయంతో ఇప్పటికే జిల్లాలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మాధకద్రవ్యాల నియంత్రణకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. డీఆర్ఓ  వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ శ్రీనివాస్, డీఎస్పీ మాధవి, డీడబ్ల్యుఓ సబిత, డీఈఓ జనార్ధన్, డీఎంహెచ్ ఒ డా.వెంకటరమణ పాల్గొన్నారు.