యాదాద్రి, వెలుగు: యాదాద్రి కలెక్టరేట్లో ‘అపాయింట్మెంట్-అపాలజీ’ పంచాయితీకి తెరపడింది. కలెక్టర్సీసీకి అగ్రికల్చర్ఆఫీసర్లు అపాలజీ చెప్పాల్సిన అవసరం లేదంటూ కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. ‘పీఎం కిసాన్ సమ్మాన్ యోజన’ కు సంబంధించి ఈ కేవైసీ చేయడంలో యాదాద్రి జిల్లా ఏవోలు వెనకబడ్డారని, 13 మందికి కలెక్టర్షోకాజ్నోటీసులు ఇచ్చారు. ఈ విషయంలో కలెక్టర్ పమేలా సత్పతిని కలసి వివరణ ఇవ్వడానికి ఏవోలు చాలా సార్లు ప్రయత్నించారు. అయితే కలెక్టర్ సీసీ సోమేశ్వర్ అపాయింట్మెంట్ఇప్పించకపోవడంతో ఏవోలు సీసీతో సంబంధం లేకుండా కలెక్టర్‌ను కలిసి వివరణ ఇచ్చారు. దీంతో సీసీ సోమేశ్వర్ ఏవోలతో వాగ్వాదానికి దిగడంతో పాటు వారిపై కలెక్టర్‌కు కంప్లైంట్చేశారు. కలెక్టర్ఏవోలను సీసీకి ‘అపాలజీ’ చెప్పాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ‘వెలుగు’ లో కథనం రావడంతో కలెక్టరేట్లో చర్చనీయాంశంగా మారింది. అనంతరం ఏవోలను పిలిపించిన కలెక్టర్కలెక్టరేట్లో జరిగిన విషయం మీడియాకు ఎవరు లీక్చేశారని ప్రశ్నించారు. తాము లీక్చేయలేదని, సీసీకి ‘అపాలజీ’ చెబుతామని ఏవోలు కలెక్టర్‌కు తెలిపారు. దీంతో ‘అపాలజీ వద్దు లెండి’ అంటూ కలెక్టర్ వివాదానికి తెరదించారు.
దళిత బంధు దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు: సీఎం కేసీఆర్ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ దేశానికే వెలుగు అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలో నిర్వహించిన నియోజకవర్గ ‘మాదిగల ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్క తరం చదివితే.. వారి తరువాత తరాలకు తిరుగుండదని రాష్ట్రంలో వందలాది గురుకులాలు ఏర్పాటు చేసిన కేసీఆర్ పేదల పాలిట అభినవ అంబేద్కర్అని కొనియాడారు. దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన తరువాత కూడా, అనివార్య కారణాల వల్ల లబ్ధిదారులు నష్ట పోతే రెండోసారి కూడా ‘దళిత రక్షణ నిధి’ ఏర్పాటు చేసి ఆదుకోవాలనుకోవడం దళితులపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. త్వరలోనే సూర్యాపేటలో అంబేద్కర్ఆడిటోరియం నిర్మిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం అక్కడే సహపంక్తి భోజనం చేశారు. చింతల పాటి చిన్న శ్రీరాములు, పెన్ పహాడ్ ఎంపీపీ భిక్షం, జడ్పీటీసీ జీడి బిక్షం తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు, వెలుగు : మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం జక్కలవారి గూడెం, మునుగోడు గ్రామాలకు చెందిన పలువురు ఆదివారం కంచర్ల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించిన అనంతరం మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను చూసే చాలా మంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. మునుగోడు ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అనంతరం మండలంలోని కల్వలపల్లి, గూడాపూర్ గ్రామాల్లో పర్యటించారు. కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, బండారు వెంకన్న పాల్గొన్నారు .
ఆర్టీసీ బస్సుల్లో బంగారం చోరీ
హుజూర్ నగర్/నేరేడుచర్ల, వెలుగు : చిలుకూరు నుంచి మిర్యాలగూడకు ఆర్టీసీ బస్సులో వెళ్తున్న ఓ ప్రయాణికురాలి బ్యాగులో చోరీ జరిగింది. హుజూర్నగర్ఎస్సై కట్టా వెంకట్‌రెడ్డి వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన నెల్లూరి పార్వతి దసరా పండుగకు తన పుట్టినిల్లు చిలుకూరుకు వచ్చింది. ఆదివారం చిలుకూరు నుంచి మిర్యాలగూడకు ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. ప్రయాణంలో హుజూర్ నగర్ కు వచ్చిన తరువాత తన బ్యాగ్ చూసుకుంది. అయితే బ్యాగులో పెట్టిన 4.5 తులాల బంగారు నగలు, డబ్బులు కనిపించలేదు. దీంతో బస్సులో చోరీ జరిగిందని గమనించి అక్కడే దిగి హుజూర్నగర్పోలీసులకు కంప్లైంట్చేసింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నేరేడుచర్లలో..
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల కు చెందిన కొప్పుల విజిత.. దసరా పండుగకు తన పుట్టినిల్లు తుంగతుర్తి మండలం సంగెం కు వెళ్లింది. శనివారం బ్యాగులో బట్టలతో పాటు బంగారు నగలు పెట్టుకుని నేరేడుచర్ల నుంచి బయలుదేరింది. బస్సులో ప్రయాణికులు రద్దీ గా ఉండటంతో తన వెంట తెచ్చుకున్న బ్యాగును తన కూతురు తో ఒక సీటు పక్కన నిలబడింది. నిలబడిన పక్క సీటులో ఇద్దరు మహిళలు కూర్చున్నారని చెప్పింది. నేరేడుచర్లలో బస్సు దిగి ఇంటికి వచ్చి బ్యాగ్‌ను చూసేసరికి 8 తులాల బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాన్షీరాం ఆశయ సాధనకు కృషి చేయాలి
కోదాడ, వెలుగు: బహుజనుల రాజ్యాధికారంతోనే వారి అభివృద్ధి సాధ్యమవుతుందని, అహర్నిశలు కృషి చేసిన బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూర్యాపేట జిల్లా ఇన్చార్జి పిల్లుట్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం కాన్షీరామ్ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రంగా థియేటర్నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెస్ కాలేజీలోని ఆడిటోరియంలో మీటింగ్నిర్వహించారు. హాజరైన శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో నీలి జెండా ఎగరవేసిన కాన్షీరామ్.. అంబేద్కర్ కు అసలైన వారసుడు అని కొనియాడారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్, నియోజకవర్గ అధ్యక్షుడు కందుకూరి ఉపేందర్ పాల్గొన్నారు.
మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతది
‘మునుగోడు’ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి
పార్టీలో చేరిన వివిధ మండలాల ప్రజలు
మునుగోడు, వెలుగు : మునుగోడులో టీఆర్‌ఎస్ ఓడిపోవడం, రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం కావడం ఖాయమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు ఉపఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ క్యాండిడేట్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఆదివారం బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ, అవినీతి పాలన సాగుతోందని, దీనిని అంతం చేయడం బీజేపీతోనే సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలన్న ఆలోచనతోనే చాలా మంది బీజేపీలో చేరుతున్నారన్నారు. మునుగోడులో బీజేపీ విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. నాయకులు వేదాంతం గోపీనాథ్, మాదగోని నరేందర్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, సుంకరబోయిన రాము, విజయ్, బోయ సురేశ్ పాల్గొన్నారు.
వివేక్ వెంకటస్వామి వెహికల్ తనిఖీ
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తున్న, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి వాహనాన్ని ఆదివారం పోలీసులు తనిఖీ చేశారు. ఆదివారం ఉదయం వివేక్ వెంకటస్వామి నల్గొండ నుంచి మునుగోడులోని రాజగోపాల్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్‌కు బయలుదేరారు. మార్గమధ్యలోని గూడాపూర్ లో చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆయన వెహికల్‌ను ఆపారు. పూర్తిగా తనిఖీ చేసిన అనంతరం తిరిగి పంపించారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
నల్గొండ అర్బన్, వెలుగు: పట్టణంలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ఎస్సై రాజశేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం.. పానగల్రోడ్డులోని ఎన్జీవోస్ కాలనీకి చెందిన దాసరి నాగరాజు(29) ట్రాక్టర్ డ్రైవర్. తాగుడుకు బానిసై లివర్వ్యాధితో బాధపడుతున్నాడు. ఆర్థిక సమస్యలు తోడవ్వడంతో భార్య జయమ్మ భర్తతో గొడవపడి శనివారం రాత్రి ఇద్దరు కుమారులను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన నాగరాజు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న రామలింగయ్య కంప్లైంట్ మేరకు కేసు ఫైల్చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆత్మహత్యపై అనుమానాలు?
నాగరాజు శనివారం సాయంత్రం ఇంటి బయట తాగి భార్య జయమ్మ సోదరుడితో ఘర్షణ పడినట్లు పలువురు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అదే సమయంలో అటుగా వెళ్లిన పెట్రోలింగ్ పోలీసులు ఇద్దరికి సర్ది చెప్పి ఇంటికి పంపించినట్లు చెప్తున్నారు.
టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం:బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు
సూర్యాపేట, వెలుగు: టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని వస్త్రం తండాలో వివిధ పార్టీల నుంచి సంకినేని సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలతో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రజలపై చార్జీల భారం మోపిందని ఆరోపించారు. మిగులు బడ్జెట్రాష్ట్రం ఉద్యోగులకు జీతాలియ్యలేని స్థితిలోకి వెళ్లిందన్నారు. మునుగోడు ఎన్నికల్లో గెలిచేది బీజేపీ అని, టీఆర్ఎస్మూడో స్థానంలో నిలువడం ఖాయమన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జల వెంకటరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అయితగాని జానయ్య గౌడ్, జిల్లా కార్యదర్శి సంధ్యాల సైదులు,బీజేపీ పట్టణ అధ్యక్షుడు అబీబ్, వార్డు అధ్యక్షుడు ధరావత్ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే ప్రజలకు సంక్షేమ ఫలాలు
సంస్థాన్‌నారాయణపురం, వెలుగు: టీఆర్ఎస్తోనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తెలిపారు. మునుగోడు బై ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఆమె పర్యటించారు. కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా చేయాలన్న కుట్రతోనే బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందన్నారు. బీజేపీని గెలిపిస్తే ప్రజలకు మరింత నష్టం చేస్తారని, టీఆర్ఎస్ను గెలిపించాలని ఆమె కోరారు.
మల్కాపురంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రచారం
చౌటుప్పల్ మండలం మల్కాపురంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే టీఆర్‌ఎస్‌పార్టీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ బిక్కు నాయక్, ప్యాక్స్ చైర్మన్ గూదె బాలనర్సయ్య, బీరప్ప, గణేశ్ ఉన్నారు.
బైక్ అదుపుతప్పి.. వ్యక్తి మృతి
యాదాద్రి, వెలుగు: వలిగొండ మండలం పులిగిల్ల లో ఆదివారం బైక్ అదుపుతప్పి కిందపడి ఓ వ్యక్తి చనిపోయాడు. ఎస్సై ప్రభాకర్వివరాల ప్రకారం.. వలిగొండ మండలం కంచనపల్లికి చెందిన పైళ్ల గోపిరెడ్డి మోటకొండూరులో జరిగిన ఫంక్షన్ బైక్‌పై వెళ్లి తిరిగి వస్తున్నాడు. పులిగిల్ల శివారులో మూలమలుపు వద్ద బైక్ స్కిడ్అయ్యి గోపిరెడ్డి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో స్పాట్లోనే చనిపోయాడు. మృతుడి కుమారుడు భాస్కర్‌రెడ్డి కంప్లైంట్మేరకు కేసు ఫైల్చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కొనసాగుతున్న సాగర్ నీటి విడుదల
హాలియా, వెలుగు: శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్లు ఆదివారం 10 గేట్లను 5 ఫీట్ల ఎత్తు మేరకు ఎత్తి 80,790 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి సాగర్‌కు 1,31,098 క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లో వస్తుండగా, 1,31,098 క్యూసెక్కుల నీటిని అవుట్ ఫ్లో గా వదులుతున్నారు.
చౌటుప్పల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
చౌటుప్పల్, వెలుగు: దసరా సెలవులు ముగియడంతో జనం పల్లెల నుంచి పట్నం బాట పట్టారు. దీంతో ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో నేషనల్హైవేపై భారీగా ట్రాఫిక్జామ్అయ్యింది. పంతంగి టోల్ గేట్ వద్ద కిలోమీటర్ల మేర వెహికల్స్క్యూకట్టడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. దీంతో ట్రాఫిక్పోలీసులు చౌటుప్పల్ లోని క్రాసింగ్ లను మూసివేసి వెహికల్స్పంపించారు.
మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓటమి తప్పదు
చండూరు, వెలుగు : మునుగోడు ఉపఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా గట్టుప్పల్‌లో ఆదివారం యువజన, విద్యార్థి విభాగాల ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్‌ల కోసం బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు రెడీగా ఉన్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా ప్రజలను మోసం చేసిన ఆయనకు ఓటమి తప్పదన్నారు. సమావేశంలో మండల అధ్యక్షుడు ఆడెపు సురేశ్‌కుమార్, పెద్దగోని రాఘవేంద్ర, ప్రవీణ్, విజయ్, శంకర్, సాయి, భరత్‌చంద్ర పాల్గొన్నారు.
ఘనంగా వాల్మీకి జయంతి
వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అధికారయంత్రాంగం, పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు వాల్మీకి ఫొటోలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి సమాజానికి అందించిన రామాయణం స్ఫూర్తితో యువత మానవతా విలువలు పాటించాలని పిలుపునిచ్చారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు వినయ్‌కృష్ణారెడ్డి, పాటిల్హేమంత కేశవ్, యాదాద్రి అడిషనల్కలెక్టర్దీపక్తివారి, జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. - నెట్వర్క్, వెలుగు
బీజేపీ విజయానికి కృషి చేయాలి
యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ స్టేట్ లీడర్ బూడిద భిక్షమయ్యగౌడ్ సూచించారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం రామస్వామితండాకుచెందిన పలువురు ఆదివారం ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న మోడీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దేశంలో గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి బీజేపీ హయాంలో ఎనిమిదేళ్లలోనే జరిగిందన్నారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. బీఆర్‌ఎస్ పేరుతో కొత్త డ్రామా స్టార్ట్ చేసిన కేసీఆర్‌కు భంగపాటు తప్పదన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా ఎవరెన్ని కుట్రలు చేసినా కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు మోటె వెంకటేశ్, బోయినపల్లి రమేశ్‌నాయక్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు దేవ్ సింగ్ పాల్గొన్నారు.