కరీంనగర్ టౌన్, వెలుగు : అందరి సహకారంతో డ్రగ్స్, గంజాయి రహిత కరీంనగర్ కోసం కృషి చేద్దామని కలెక్టర్ పమేలాసత్పతి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. గంజాయి నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలన్నారు.
పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత పేరెంట్స్‌పై ఉందన్నారు. అనంతరం వైద్యాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. ఆయా సమావేశాల్లో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఎంహెచ్‌వో సుజాత, డీడబ్ల్యూవో ఎం.సరస్వతి పాల్గొన్నారు.