బాలికల భద్రత కోసం స్నేహిత మీటింగ్ :  పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: బాలికల భద్రత, వారిలో ఆత్మస్థైర్యం పెంచేందుకు ప్రభుత్వ స్కూళ్లలో స్నేహిత కార్యక్రమం చేపడుతున్నామని కలెక్టర్​ పమేలా సత్పతి తెలిపారు.  గురువారం స్థానిక కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో  యునిసెఫ్ ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యునిసెఫ్ సహకారంతో  బాలికల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. సెగ్రిగేషన్ షెడ్లను పూర్తిస్థాయిలో వినియోగిస్తామన్నారు

తడి, పొడి చెత్త వేరు చేసే అంశంపై ప్రజలకు విస్తృతంగా  అవగాహన కల్పించాలని  అధికారులను ఆదేశించారు. అంతకుముందు యునిసెఫ్ ప్రతినిధుల బృందం తిమ్మాపూర్ మండలం జోగయ్య పల్లెలోని  పీహెచ్‌‌‌‌‌‌‌‌సీ, జీపీ ఆఫీస్, అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు  యునిసెఫ్ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. పనులు బాగా చేస్తున్నారని అధికారులను అభినందించారు. సమావేశంలో  అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్,  యునిసెఫ్ ప్రతినిధులు  కౌశికి బెనర్జీ, అరలికట్టి వెంకటేశ్, సీపీవో మురళీకృష్ణ, డీడబ్ల్యూవో సరస్వతి, యూనిసెఫ్ కోఆర్డినేటర్  కిషన్ స్వామి పాల్గొన్నారు.

ఎన్నికల నిర్వహణకు సహకరించాలి 

జగిత్యాల టౌన్, వెలుగు: జిల్లాలో పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు, ప్రజలు సహకరించాలని జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ గురువారం ఓ ప్రకటనలో కోరారు. ఆయన మాట్లాడుతూ ఫ్లయింగ్ స్క్వాడ్‌‌‌‌‌‌‌‌,  స్టాటిస్టిక్ సర్వెలెన్స్‌‌‌‌‌‌‌‌ బృందాలు, వీడియో బృందాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ అమల్లో ఉన్నందున ప్రజలు పోలీసులకు సహరించాలని కోరారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర వస్తువులు తీసుకెళ్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని, లేదా డయల్ 100కి తెలియజేయాలన్నారు. జిల్లా సరిహద్దుల్లో 9 చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులు ఏర్పాటుచేశామన్నారు. సోషల్ మీడియాపై నిఘా పెట్టామని, 24గంటలు ఐటీ సభ్యులతో స్పెషల్  టీం ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు రూ.6.80లక్షలు, 239.15  లీటర్ల లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.