కరీంనగర్ టౌన్, వెలుగు: రుణమాఫీ విషయంలో రైతులు ఇబ్బందులు పడకుండా వ్యవహరించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ రుణమాఫీ అమలు తీరుపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రుణమాఫీలో కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. రైతులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. రైతుల సలహాలు, సందేహాల నివృత్తికి కలెక్టరేట్‌లోని డీఏవో ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఎల్డీఎం ఆంజనేయులు, డీఏవో బత్తుల శ్రీనివాస్, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణ రావు, బ్యాంకుల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ మీటింగ్‌కు ఏర్పాట్లు
రైతు భరోసా స్కీం అమలుపై శుక్రవారం కరీంనగర్ లో నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణ మీటింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గురువారం స్థానిక గోదావరిఖని బైపాస్‌లోని వీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో రైతుభరోసా మీటింగ్ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. సమావేశానికి హాజరుకానున్న రైతులు, రైతు ప్రతినిధులు, ప్రజాప్రతినిధులకు సీటింగ్, లంచ్ తదితర ఏర్పాట్లను సక్రమంగా చేపట్టాలని ఆదేశించారు.