లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం: పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు :  లింగ నిర్ధారణ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో లలితాదేవితో కలిసి  కలెక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ లోని ఎంసీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంతానోత్పత్తి సమస్యలపై  అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం పేషంట్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రతి విభాగాన్ని పరిశీలించి, సేవలు బాగున్నాయని డాక్టర్లను అభినందించారు. కలెక్టర్​ వెంట సూపరింటెండెంట్  వీరారెడ్డి , డీసీహెచ్​కృష్ణ ప్రసాద్, ఆర్ఎంఓ జ్యోతి, డాక్టర్ అలీం పాల్గొన్నారు.