కౌంటింగ్‌‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి : పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్,వెలుగు : కరీంనగర్, మానకొండూర్, హుజూరాబాద్, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు  చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.  గురువారం కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్  డిగ్రీ కాలేజీలోని స్ట్రాంగ్ రూం, కౌంటింగ్  సెంటర్లను సీపీ అభిషేక్ మహంతితో కలిసి పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  ప్రతి నియోజకవర్గానికి చెందిన ఎంట్రీ, ఎగ్జిట్‌‌లు వేర్వేరుగా ఉండాలని,  కౌంటింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని  ఆదేశించారు.  కార్యక్రమంలో   ఏసీపీ ప్రతాప్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఉల్లంఘనలపై నేరుగా ఫిర్యాదు చేయండి

కరీంనగర్,  చొప్పదండి, మానకొండూర్‌‌‌‌, హుజూరాబాద్​ నియోజకవర్గాలకు సంబంధించిన కోడ్​ ఉల్లంఘనలపై ఆర్‌‌‌‌అండ్‌‌బీ  గెస్ట్​ హౌజ్‌‌లో నేరుగా , ఫిర్యాదు చేయాలని ఎలక్షన్​జనరల్​అబ్జర్వర్లు డాక్టర్ సీఆర్ ప్రసన్న, ఎంఆర్ ​రవికుమార్​ తెలిపారు. గురువారం ఆర్అండ్​బీ  గెస్ట్​హౌజ్‌‌లో వారు మాట్లాడుతూ మానకొండూర్‌‌‌‌, హుజూరాబాద్ ​నియోజకవర్గాలకు ఉదయం 9గంటల నుంచి 11గంటలవరకు, కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాలకు సంబంధించి ఉదయం ఉదయం 9గంటల నుంచి 10.30గంటల వరకు స్వీకరిస్తామని  వెల్లడించారు.  

పెయిడ్ న్యూస్ పర్యవేక్షణకు కమిటీ

రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి 

రాజన్న సిరిసిల్ల,వెలుగు : ప్రచార కార్యక్రమాలకు సంబంధించి అడ్వర్టైజ్‌‌మెంట్లు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ఆడియో వీడియో డిస్ ప్లే, సినిమా థియేటర్లు, ఎఫ్ఎం, బల్క్ ఎస్ఎంఎస్ లు, వెబ్‌‌సైట్‌‌లో ప్రకటనలు, ప్రచారాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్, ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని రకాల మీడియాలో వచ్చే పెయిడ్ న్యూస్ గుర్తింపునకు మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

కమిటీలో జిల్లా ఎన్నికల అధికారి చైర్మన్‌‌గా సిరిసిల్ల ఆర్డీవో, డీపీఆర్వో, సీపీవో, ఈడీఎం సీనియర్ జర్నలిస్టును నియమించామన్నారు. అనుమానిత చెల్లింపు కథనాల న్యూస్ కు సంబంధించి డీవీఏపీ  సమాచార శాఖ అందించిన రేట్ కార్డు ఆధారంగా వాటికి అయ్యే ఖర్చును ఎన్నికల వ్యయంలో జమ చేసేందుకు ఆర్‌‌‌‌వో ద్వారా నోటీసులు జారీ చేస్తామని అనురాగ్ జయంతి తెలిపారు.