ఎలక్షన్ డ్యూటీల్లో అలర్ట్‌‌‌‌‌‌‌‌గా ఉండాలి : పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్,వెలుగు: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సెక్టార్​ ఆఫీసర్లు తమ విధుల్లో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో మంగళవారం సెక్టార్ ఆఫీసర్లకు ట్రైనింగ్  ప్రోగ్రాం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సామగ్రి  డిస్ట్రిబ్యూషన్ నుంచి పోలింగ్ పూర్తయ్యే దాకా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పనిచేయాలన్నారు. డీఆర్డీవో శ్రీధర్, ఎన్నికల మెటీరియల్ నోడల్ ఆఫీసర్ మాధవి, సెక్టార్ ఆఫీసర్లు పాల్గొన్నారు. 

ఆర్బీఐ ఆధ్వర్యంలో 2కే రన్

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించేందుకు ఆర్బీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి  తెలంగాణ చౌక్, బస్టాండ్ మీదుగా 2కే రన్​ నిర్వహించారు. రన్‌‌‌‌‌‌‌‌లో డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో పవన్ కుమార్, డీఈవో  జనార్దన్‌‌‌‌‌‌‌‌రావు, యూబీఐ డీజీఎం అపర్ణ, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణ రావు, ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ చీఫ్ మేనేజర్ రామచంద్రుడు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.