హాస్టళ్లల్లో శుభ్రత, నాణ్యత పాటించాలి : పమేలా సత్పతి

  • కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో శుభ్రత పాటించాలని, నాణ్యమైన సరుకులు వినియోగించాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో హాస్టల్స్ వెల్ఫేర్ ఆఫీసర్లతో కలెక్టర్ రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్టళ్లలో కామన్‌‌‌‌‌‌‌‌ మెనూను పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ రోజుకు కావలసిన సరుకులను ఆ రోజు తీసుకోవాలని సూచించారు. స్పెషల్ ఆఫీసర్లు డెయిలీ హాస్టళ్లను సందర్శించాలన్నారు.  

అనంతరం కరీంనగర్ శిశుగృహలో పెరుగుతున్న 4 నెలల మగశిశువును  సిద్దిపేటకు చెందిన దంపతులకు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దత్తత ఇచ్చారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో పవన్ కుమార్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌‌‌‌‌‌‌‌, డీడబ్ల్యూవో సబిత, డీసీపీవో పర్వీన్  పాల్గొన్నారు.

జంగపల్లి హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో టెడ్‌‌‌‌‌‌‌‌ ఎడ్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం 

గన్నేరువరం, వెలుగు:  ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌లో ప్రావీణ్యం, విషయ పరిజ్ఞానం అందించేలా అంతర్జాతీయంగా పలు దేశాల్లో నిర్వహిస్తున్న టెడ్- ఎడ్ (టెక్నాలజీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ డిజైన్ ఎడ్యుకేషన్) లైసెన్స్ జంగపల్లి హైస్కూల్‌‌‌‌‌‌‌‌కు దక్కడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం స్కూల్‌‌‌‌‌‌‌‌లో టెడ్-ఎడ్ శిక్షణను కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థుల్లో ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌ ప్రావీణ్యం పెంచేందుకు కృషి చేస్తున్న హెచ్‌‌‌‌‌‌‌‌ఎం శారద, టీచర్లు శ్రీనివాస్, వసుంధరను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఈవో జనార్ధనరావు, తహసీల్దారు, ఎంఈవో రామయ్య, ఎస్‌‌‌‌‌‌‌‌వీ అశోక్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.


తిమ్మాపూర్, వెలుగు: వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం రేణికుంట జీపీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన గురువారం ఆమె సందర్శించారు. క్యాంపు నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి, రిజిస్టర్​ను తనిఖీ చేశారు. డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో వెంకటరమణ, ఎంపీడీవో విజయ్ కుమార్, కో ఆర్డినేటర్ సనా, కార్యదర్శి శ్రీధర్ ఆమె వెంట ఉన్నారు.