![పోలింగ్ సెంటర్లల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి](https://static.v6velugu.com/uploads/2025/02/collector-pamela-satpathy-inspects-polling-stations-for-mlc-elections_ArCO3PoeVG.jpg)
కరీంనగర్ టౌన్, వెలుగు: ఈనెల 27న జరగనున్న గ్రాడ్యుయేట్స్,టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ఉమెన్స్ గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, వాణినికేతన్ కాలేజీ, గవర్నమెంట్ ధన్గర్ వాడి హైస్కూల్, గంగాధర జడ్పీహెచ్ఎస్ స్కూల్ పోలింగ్ సెంటర్లను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ సంఖ్యను ఓటర్లకు కనిపించే విధంగా ప్రదర్శించాలన్నారు. కేంద్రాల్లో వెలుతురు ఉండేలా చూడాలన్నారు. దివ్యాంగ ఓటర్లకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డిఓ మహేశ్వర్, అసిస్టెంట్ జియాలజిస్ట్ వెంకటేశ్వరరావు, తహసిల్దార్లు నరేందర్, అనుపమ, ఎంపీడీవో రాము, ఆర్ఐ లు శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.