ప్రజలకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు : కలెక్టర్ పమేలా సత్పతి

హుజూరాబాద్,​ వెలుగు:  ప్రజాపాలన కేంద్రాల్లో  దరఖాస్తుదారులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని కరీంనగర్​ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు.   బుధవారం హుజూరాబాద్​మండలం వెంకట్రావ్ పల్లి, సిర్సపల్లి  గ్రామాలతోపాటు  మున్సిపల్​ ఆఫీసులో నిర్వహిస్తున్న సెంటర్లను కలెక్టర్ పరిశీలించారు.  

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రాలకు వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులు, మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.  కిరాయి ఇంట్లో ఉండేవారి పేరుతో వచ్చే దరఖాస్తులకు గృహజ్యోతి కోసం కిరాయి ఇంటిదారుగా నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజు, మున్సిపల్ కమిషనర్ సమయ్య, ఎంపీడీవో జయశ్రీ,  ప్రత్యేకాధికారి పద్మావతి పాల్గొన్నారు. 

ప్రతిఒక్కరి నుంచి దరఖాస్తులు తీసుకోవాలి

జగిత్యాల రూరల్, వెలుగు: గ్రామాలు, పట్టణాల్లో అర్హత కలిగిన ఏ ఒక్కరు తప్పిపోకుండా దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ యాస్మిన్ భాషా అధికారులను ఆదేశించారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు వార్డులు, రూరల్ మండలంలోని అనంతారం, తక్కళ్లపల్లి  గ్రామాల్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. 

డీపీవో దేవరాజ్, మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు, డీఈ రాజేశ్వర్, పీడీ శ్రీనివాస్, ఏడీ నరేశ్​పాల్గొన్నారు. తిమ్మాపూర్, వెలుగు: తిమ్మాపూర్​మండలం నల్లగొండ గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన అప్లికేషన్​ స్వీకరణ  సెంటర్లను అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్​దేశాయి తనిఖీ చేశారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.