కరీంనగర్ టౌన్, వెలుగు: తిమ్మాపూర్ మండలం సుభాష్ నగర్ అంగారిక టౌన్ షిప్ లో మౌలిక వసతుల పనుల్లో వేగం పెంచి వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కరీంనగర్లో సుడా, మున్సిపల్ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్తు, సీసీ రోడ్లు ఇతర పనులు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.
జాప్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ పనులు పూర్తయిన తర్వాత మిగిలిపోయిన ప్లాట్లకు సంబంధించిన వేలం అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్లాట్ల వివరాలను అధికారులు సిద్ధం చేసుకోవాలని చెప్పారు.