పారదర్శకంగా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలి : కలెక్టర్ పమేలా సత్పతి

హుజూరాబాద్ రూరల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా పథకాలకు లబ్ధి దారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో జరుగుతున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల వివరాలు నమోదు చేయాలన్నారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఇంటింటికీ వెళ్లి కుటుంబ ఆర్థిక స్థితిగతులను పరిశీలించాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం  నిబంధనలు పాటించాలని సూచించారు. గడువులోగా ప్రక్రియ పూర్తి చేసి గ్రామసభలు నిర్వహించాలన్నారు. ఏవైనా అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. బోర్నపల్లి శివారులో రైతు భరోసా సర్వేను కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశీలించారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంట ఆర్డీవో రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, డీడబ్ల్యూవో సబిత, తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీవో సునీత, సిబ్బంది పాల్గొన్నారు. 

ఆపద మిత్ర వాలంటీర్లు ముందుండాలి

కరీంనగర్ టౌన్,వెలుగు: ప్రమాదం ఎప్పుడైనా.. ఏ రూపంలోనైనా రావచ్చని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు.శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో 12రోజుల పాటు ఏర్పాటు చేసిన ఆపదమిత్ర శిక్షణ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొని మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను రక్షించేందుకు ఆపద మిత్ర వాలంటీర్లు ముందుండాలని సూచించారు.

విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వఉద్యోగులతో పాటు స్వచ్ఛందంగా ముందుకొచ్చే వాలంటీర్లకు ఆపద మిత్ర శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఫైర్, పోలీస్, పంచాయతీరాజ్, వైద్యశాఖ, పశుసంవర్ధక శాఖ శాఖలలోని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారికి శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఆపదమిత్రలకు  హెల్మెట్లు ఇచ్చారు.  ఆర్డీవో పవన్ కుమార్, జిల్లా ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ ఎం.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.