ఆత్మహత్యకు అవకాశం ఇవ్వాలని గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహిళ వినతి

ఆత్మహత్యకు అవకాశం ఇవ్వాలని గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహిళ వినతి
  • ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం లేదు..

జగిత్యాల/జగిత్యాల టౌన్, వెలుగు : తాను ఉన్నత చదువులు చదివానని, తనకు ఏదైనా జాబ్ ఇప్పించాలని లేదా కారుణ్య ఆత్మహత్యకు అనుమతించాలని రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన నక్క సునీత ప్రజావాణిలో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్యప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వేడుకుంది. తనకు ముగ్గురు మానసిక దివ్యాంగులైన పిల్లలున్నారని, ఉపాధి లేక వారి పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఉపాధి కోసం గల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వలస వెళ్లినట్లు సునీత అర్జీలో పేర్కొంది.

పీజీ స్పెషల్ బీఈడీ చదివిన తనకు జాబ్ ఇవ్వడానికి 370 జీవో అడ్డుగా ఉందని అధికారులు చెబుతున్నారని కనీసం తన భర్తకైనా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంది. ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాకపోతే ముగ్గురు పిల్లలతో తమకు ఆత్మహత్యనే శరణ్యమని పేర్కొంది. జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి.సత్యప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడిషనల్ కలెక్టర్లు లత  గౌతమ్ రెడ్డితో కలిసి గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురి నుంచి 52 అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లాలోని వివిధ స్కూళ్లకు చెందిన సీఎం కప్ టోర్నమెంట్ విజేతలను కలెక్టర్ అభినందించారు.  ధర్మపురి ప్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.కోటికి పైగా అవకతవకలు అయ్యాయని సొసైటీ సభ్యుడు జె సురేందర్ సోమవారం గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. సొసైటీ లో రూ.1.24కోట్లు అవకతవకలపై పాలకవర్గానికి గతేడాది సంజాయిషీ నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. 

గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 254 అర్జీలు 

కరీంనగర్ టౌన్,వెలుగు: గ్రీవెన్స్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని  కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్ 253 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ అప్లికేషన్లలో ఎక్కువగా 46  కరీంనగర్ బల్దియాకు సంబంధించినవే ఉన్నాయన్నారు.

.అనంతరం నిర్వహించిన రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ధరణి దరఖాస్తులను జనవరి 30లోగా క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్,  లక్ష్మీకిరణ్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో పవన్ కుమార్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు పాల్గొన్నారు.