
కరీంనగర్ టౌన్, వెలుగు: భవిత కేంద్రాలల్లోని ప్రతి దివ్యాంగ విద్యార్థి ప్రొఫైల్ రెడీ చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లాలోని భవిత కేంద్రాల్లో పనిచేస్తున్న ప్రత్యేక విద్య టీచర్లు, రిసోర్స్ పర్సన్స్‌తో గురువారం కలెక్టరేట్‌లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు మంజూరు చేసే యూడీఐడీ కార్డుల పట్ల భవిత విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. భవిత కేంద్రాలకు కావలసిన ప్రత్యేక వస్తువులు, ఆట పరికరాలు, సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. యుడీఐడీ కార్డుల ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కొత్తగా సదరం సర్టిఫికెట్ కోసం నమోదు చేసుకునే వారు మాత్రమే యూడీఐడీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 21 రకాల అంగవైకల్యం ఉన్నవారికి ఈ కార్డు జారీ అవుతుందన్నారు. కార్డు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే 9490881098 కు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, డీడబ్ల్యూవో సబిత, డీఆర్డీవో శ్రీధర్, డీఈవో జనార్ధన్ రావు, భవిత కోఆర్డినేటర్ ఆంజనేయులు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, పాల్గొన్నారు
చిల్డ్రన్ పార్క్‌తో పిల్లలకు ట్రాఫిక్‌పై అవగాహన
తిమ్మాపూర్, వెలుగు: చిల్డ్రన్ ట్రాఫిక్ పార్క్‌తో చిన్నారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడమే కాకుండా రోడ్డు భద్రత నియమాలను నేర్పించవచ్చునని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రవాణా శాఖా కార్యాలయ ఆవరణలో ఉన్న ట్రాఫిక్పార్క్ను ఆమె గురువారం సందర్శించారు. పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పనుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా రవాణా శాఖ కమిషనర్ పురుషోత్తం, డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవీఐ రవికుమార్ ఉన్నారు.