గ్రీవెన్స్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ పమేలాసత్పతి 

గ్రీవెన్స్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ పమేలాసత్పతి 

కరీంనగర్ టౌన్,వెలుగు: ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో  నిర్వహించిన ప్రజావాణిలో 253 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దరఖాస్తులను పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీకిరణ్‌‌‌‌‌‌‌‌, ప్రఫుల్ దేశాయి, కమిషనర్ చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌పాయ్‌‌‌‌‌‌‌‌, ఆర్డీవోలు రమేశ్‌‌‌‌‌‌‌‌, మహేశ్వర్ పాల్గొన్నారు.

మున్సిపల్ అధికారులపై ప్రజావాణిలో ఫిర్యాదు

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణిలో మున్సిపల్ అధికారులపై కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్యప్రసాద్‌‌‌‌‌‌‌‌కు భగవాన్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ అనే యువకుడు ఫిర్యాదు చేశాడు. పదేండ్ల కింద అనుమతులు లేకుండా నిర్మించిన బిల్డింగ్‌‌‌‌‌‌‌‌కు ఇటీవల పర్మిషన్లు ఇచ్చిన బల్దియా అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. నర్సింగాపూర్ గ్రామంలోని 437,251 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూములను అక్రమంగా చేయించుకున్న పట్టాలు రద్దు చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ అమలు చేయాలని రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు పన్నాల తిరుపతిరెడ్డి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రజావాణికి 35 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.