మహిళల ఆరోగ్య సంరక్షణే శుక్రవారం సభ లక్ష్యం : కలెక్టర్ పమేలా సత్పతి

మహిళల ఆరోగ్య సంరక్షణే శుక్రవారం సభ లక్ష్యం : కలెక్టర్ పమేలా  సత్పతి

వీణవంక, వెలుగు: మహిళలు, శిశువుల ఆరోగ్య సంరక్షణే శుక్రవారం సభ లక్ష్యమని కరీంనగర్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి అన్నారు. వీణవంక మండలం ఎల్బాక గ్రామంలో  ‘శుక్రవారం సభ’లో ఆమె పాల్గొని మాట్లాడారు. శుక్రవారం సభలో భాగంగా హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గర్భిణులు, బాలింతలు, ఐదేండ్ల లోపున్న పిల్లలకు ఎలాంటి సమస్య ఉన్నా ప్రత్యేక మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేస్తారన్నారు. అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందజేస్తారన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో వెంకటరమణ, డీడబ్ల్యూవో సరస్వతి,  ఆర్డీవో రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో చంద్రశేఖర్, అడిషనల్ ఆర్డీవో సునీత, మండల ప్రత్యేక అధికారి కొమురయ్య, సీడీపీవో సుగుణ, ఎంపీడీవో శ్రీధర్, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్ పాల్గొన్నారు.

జాతీయ పోటీలకు ఎంపికైన  స్టూడెంట్లకు అభినందన 

కరీంనగర్ టౌన్, వెలుగు: ఎస్జీఎఫ్​ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీల్లో సత్తాచాటి జాతీయ స్థాయి ఎంపికైన కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లను శుక్రవారం తన చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో లక్నోలో జరిగే  జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటాలని సూచించారు. అంతకుముందు యాంటి బయోటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నష్టాలపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐఎంఏ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆవిష్కరించారు. యాంటీ బయోటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మితిమీరిన వాడకం ప్రమాదమన్నారు.