కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా శిక్షణ కేంద్రంలో జూనియర్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధుల్లో ఎదురయ్యే సమస్యలు, సంఘటనలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్ సెంటర్ అధికారి శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించండి
కొత్తపల్లి, వెలుగు: విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కొత్తపల్లి మండలం తకుంట హైస్కూల్‌ను కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్‌లో మధ్యాహ్న భోజనం చేస్తున్న పిల్లలను భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనంలో పోషకాహారం అందించాలని సూచించారు. అనంతరం భోజన మెనూను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఈవో జనార్దన్ రావు, ఎంఈవో మధుసూదనాచారి, టీచర్స్ పాల్గొన్నారు.