
కరీంనగర్ టౌన్, వెలుగు: ఇంటి పనులతో పాటు ఉద్యోగ బాధ్యతల్లో కీలకపాత్ర పోషిస్తున్న మహిళా ఉద్యోగులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం సిటీలో టీఎన్జీఒ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి కలెక్టర్ పమేలాసత్పతి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు తమ కుటుంబ పనులతో పాటు ఉద్యోగ జీవితంలో తీరిక లేకుండా ఉంటారని, కచ్చితంగా 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇటీవల పెద్దపల్లిలో ఇంటర్నేషనల్ షావొలిన్ కుంగ్ ఫూ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్ సాధించిన గంగాధర మండలం, ఒడ్యారం జడ్పీహైస్కూల్ స్టూడెంట్ తపస్వినిని కలెక్టర్ అభినందించారు.
అనంతరం వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ ను ఎస్ఆర్ఆర్ అటానమస్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి ప్రిన్సిపల్ రామకృష్ణతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీజీఒ ప్రెసిడెంట్ కాళీచరణ్,సెక్రటరీ రవీందర్ రెడ్డి, టీఎన్జీఒ సెక్రటరి సంగెం లక్ష్మణ్ రావు, వెలిచాల సుమంత్ రావు, ముప్పిడి కిరణ్ రెడ్డి, డీడబ్ల్యుఒ సబిత, ఎంఇఒ ప్రభాకర్ రావు, డా.అర్జున్,తదితరులు పాల్గొన్నారు.