ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దీటుగా రిజల్ట్స్ సాధించాలి : కలెక్టర్ పమేలా సత్పతి

ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దీటుగా రిజల్ట్స్ సాధించాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: శ్రద్ధతో చదివి పదోతరగతి ఫలితాల్లో ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దీటుగా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు మార్కులు తెచ్చుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థులకు సూచించారు. బుధవారం సప్తగిరి కాలనీలోని హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యార్థులకు బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో  చేపడుతున్న బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపిణీని కలెక్టర్  ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిటీలోని 20 ప్రభుత్వ స్కూళ్లల్లో టెన్త్ చదువుతున్న 700 మంది స్టూడెంట్లకు అల్పాహారం పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం స్టూడెంట్లతో కలిసి కలెక్టర్ బ్రేక్​ఫాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అనంతరం ముకరంపురలోని భవిత సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అలీమ్ కో సంస్థ సహకారంతో జిల్లాలోని భవిత కేంద్రాల్లోని దివ్యాంగ విద్యార్థులకు ఉపకారణాలు అందజేశారు. 

గంగాధర, వెలుగు: వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ప్రత్యేక బోధన అందిస్తామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గంగాధర మండలం గట్టుభూత్కూర్ హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇటుకబట్టీ కార్మికుల పిల్లలకు ఏర్పాటుచేసిన ప్రత్యేక పాఠశాలను బుధవారం సందర్శించారు.

ఈ సందర్భంగా 50 మంది కార్మికుల పిల్లలతో ఒడియా, హిందీ భాషల్లో మాట్లాడి వారికి ఇస్తున్న ఆహారం, బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం 6వ తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ బోధించారు. ఆయా కార్యక్రమాల్లో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఈవో జనార్ధన్ రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, బాలాజీ సేవా సమితి ప్రెసిడెంట్ ప్రసాద్, అలీమ్ కో సంస్థ ప్రతినిధులు, ఎంఈవో ప్రభాకర్ రావు పాల్గొన్నారు.