- జాబ్‌మేళాలో కలెక్టర్ పమేలా సత్పతి
తిమ్మాపూర్, వెలుగు: తాను నాలుగు ఉద్యోగాలను వదులుకొని కలెక్టర్ స్థాయికి ఎదిగానని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మంగళవారం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని సాయిరాం గార్డెన్ లో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే సతీమణి అనురాధతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాబ్ మేళాలో నియోజవర్గానికి చెందిన సుమారు 6వేల మంది నిరుద్యోగులు హాజరైనట్లు చెప్పారు. సుమారు 60 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయని, ఇందులో 25 కంపెనీలు స్పాట్‌లోను ఉద్యోగాలకు ఎంపిక చేసుకొని నియామక పత్రాలు ఇవ్వడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి, తహసీల్దార్ కనకయ్య, ఎంపీపీలు సులోచన, ఉట్కూరి వెంకటరమణారెడ్డి, నుస్తులాపూర్ ఎంపీటీసీ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.